ప్రజాశక్తి-తిరుపతి : ఈ నెల 5వ తేదీ నుండి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ఈతల పోటీలకు బాపట్ల జూనియర్ కళాశాల విద్యార్థి ఉప్పాల జ్ఞాన వివేక్ గౌడ్ ఎంపిక అయ్యాడు. ఈ సంవత్సరం జనవరిలో తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి ఈతల పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లా తరుపున పాల్గొన్న వివేక్ రెండు వెండి పథకాలు సాధించాడు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో జరిగే పోటీలలో పాల్గొనడానికి అవకాశం దొరికింది.










