ప్రజాశక్తి-విశాఖ: విశాఖలో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సీపీఎం, సీపీఐ, జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. తీర్మానం చేయకపోవడంతో మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. విశాఖ ఉక్కు ప్రవేటికరణపై పివిఎన్ మాధవ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టిడిపి, సీపీఎం, సీపీఐ, జనసేన ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో నిరసన తెలిపారు.










