Jul 31,2021 18:36

అర్జంటీనా : సముద్రంలో నీటి మట్టం పెరగడంతో తీరంలో ఉన్న రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటన బ్యునోస్‌ ఎయిర్స్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ.. నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. జులై 28న బ్యునోస్‌ ఎయిర్స్‌లోని మర్‌దెల్‌ తుయు ప్రాంతం నుంచి ఈ వీడియోను కెమెరాలో బంధించారు. సముద్రంలో ఎగిసిపడిన అలలతో తీరానికి ఆనుకొని ఉన్న ఇంటి ఫౌండేషన్‌ దెబ్బతిన్న కారణంగా రెండంతస్తుల భవనం సముద్రంలో కుప్పకూలిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఒక్క ఘటనమే మాత్రమే కాదు.. తీర ప్రాంతం కోతకు గురవుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. కాగా సంఘటన జరిగిన సమయంలో యజమానులు ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.

వీడియో https://twitter.com/SkyNews/status/1420969904367407105?s=20