Jul 14,2023 18:51

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌, దళపతి విజయ్, శ్రీకాంత్‌, జీవా, ఇలియానాలో కాంబినేషన్‌లో ఇంతకుముందు రూపొందిన హిట్‌ చిత్రం నన్బన్‌. ఇది హిందీ చిత్రం 3 ఇడియట్స్‌ చిత్రానికి రీమేక్‌. కాగా మళ్లీ శంకర్‌ - విజయ్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. విజయ్ త్వరలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రంలో నటించనున్నాడు. దీని తర్వాత నటనకు గ్యాప్‌ ఇచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం కమల్‌ హాసన్‌తో ఇండియన్‌ 2 చిత్రాన్ని; తెలుగులో రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా గేమ్‌ఛేంజర్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత విజరు హీరోగా నటించే చిత్రాన్ని తెర కెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర వన్‌లైన్‌ కథను విజరుకు చెప్పగా, సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇది విజరుకు 70వ చిత్రం అవుతుంది.