
అమరావతి : యువకుల విహార యాత్ర విషాదాంతమైంది. కడప జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగులో పడి నలుగురు యువకులు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.