ప్రజాశక్తి-విఆర్ పురం(అల్లూరి) : ఏం కొనాలి... ఏం తినాలి... అన్నట్లుంది సామాన్యుడి పరిస్థితి. ఉల్లిపాయలు కోస్తే కళ్లలో నుంచి నీళ్ళువచ్చేవి. కానీ ఇప్పుడు కూరగాయలవైపు చూస్తే కళ్ళ నుంచి రక్తపు చుక్కలు వస్తున్నాయి. అతి వృష్టి, అనావృష్టి గత కొద్ది రోజులుగా కూరగాయలు ధరలు ఆకాశానంటి చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో కూరగాయాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో పరిస్థితి దారుణం. ఇక టమోటా ధరల గురించి చెప్పే పరిస్థితే లేదు. కొండెక్కి కూర్చున్న ధరలతో సామాన్యులు. తినే పరిస్థితి కనిపించటంలేదు. కిలో టమోటా ధరతోమేరీ పోల్చితే కిలో చికెన్ వస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కరలేదు. కిలో టమోట ధర రూ.240 లకు పైగా ధర పలుగుతుంది. కొన్ని చోట్లయితే అంతకు మించి అమ్ముడు పోతుంది. దీంతో టమోటాతో కూర అంటేనే భయపడి పోతున్నారు. హోటల్స్ లో అయితే టమోటా చెట్నీ చేయడమే మానేశారు. గోనె సంచితో డబ్బులు పట్టుకొని మార్కెట్ కు వెళితే చేతి సంచితో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఉన్నంతలోనే కొనుగోలు చేస్తున్నారు. దాదాపు నెల క్రితం గిరిజన గ్రామాల్లో కిలో టమోట ధర రూ.50,కిలో పచ్చిమిర్చి ధర రూ.40, కిలో అల్లం ధర రూ.50 లు ఉండగా ప్రస్తుతం వాటి ధరలు కిలో టమోటా రూ.240, కిలో పచ్చిమిర్చి రూ.180, కిలో అల్లం రూ.150 లు ధర పలుకుతుంది. కూరగాయలు పండిస్తున్నప్పట్టికీ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఫలితంగా ప్రతి కూరగాయులు కూరలో కీలకమైన టమోటా, పచ్చి మిర్చి, అల్లం ధరలు పెరగటంతో సామాన్యులకు అందని ద్రాక్ష గా కూరగాయలు ఉన్నాయి. టమోట పర్వాలేదని ధరలు వారం, పది రోజుల్లో తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ఆ పరిస్థితులు-మండుతున్న కూరగాయల ధరలు చికెన్ ధరతో పోటీ పడుతున్న టమోటా కనిపించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. వేసవిలో చికెన్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. రుతుపవనాలు రాకతో క్రమంగా చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం చికెన్ ధరలు చూస్తే మార్కెట్ లో ఫారం కోడి కిలో లైవ్ రూ.115, కిలో చికెన్ రూ.240, కిలో స్కిన్ లెస్ రూ.220 లు. బండ కోడి కిలో లైవ్ రూ.115, కిలో చికెన్ రూ.130 విక్రయిస్తున్నారు. మొన్నటి వరకు పెళ్లిళ్ల సీజన్, ఎండాకాలంలో కోళ్లు చనిపోవటంతో ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధిక శ్రావణ మాసం ప్రారంభమయ్యింది. కూరగాయల ధరలు మాత్రం తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతం ధరలు ఆకాశన్నంటిన తరుణంలో చికెన్ ధరలు తగ్గటం ఊరటనిచ్చే అంశమే. కూరగాయలు కన్నా చికెన్ పించినా. చికెన్ టమోటా, పచ్చిమిర్చి, అల్లం అవసరం. అందుకే ఏదీ కొనలేం... ఏదీ తినలేం. ఇప్పుడు గోదావరిని పెరగటంతో త్యావసర సరుకులు తగ్గే పరిస్థితి లేదు ప్రజలు ఆరోపిస్తున్నారు.










