May 01,2023 20:01

వినతిపత్రం స్వకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - ఆదోని
ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం కలిగించేలా అధికారులు పని చేయాలని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ సూచించారు. సోమవారం పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో డివిజన్‌లోని ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు డివిజన్‌ స్థాయి వరకు వస్తున్నాయన్నారు. మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లకుండా చూడాలన్నారు. పరిపాలన అధికారి గోవింద్‌ సింగ్‌, డిఎల్‌పిఒ నూర్జహాన్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణు సూర్య, ఆర్‌టిసి డిపో మేనేజర్‌ రఫీ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ చేతన్‌ ప్రియా, బీసీ వెల్ఫేర్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.