Oct 07,2023 21:09

విలేకర్లతో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  వ్యవస్థలను మేనేజ్‌ చేసే గుణం చంద్రబాబునాయుడిదేనని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం జెడ్‌పి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పేద ప్రజలు ఆరోగ్యం మెరుగుపడేలా సురక్ష కార్యక్రమం ద్వారా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఈ క్యాంప్‌ లు నెలాఖరు వరకు కొనసాగుతాయని తెలిపారు. 105 రకాలు మందులను, అనేక టెస్టులును ఉచితంగా అందిస్తున్నామన్నారు. వైసిపి రాష్ట్ర స్థాయిలో ప్రతినిధుల సభను ఈనెల9న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించబోతున్నా మన్నారు. జిల్లా నుంచి 300 మందిని పార్టీ గుర్తించి సభకు ఆహ్వానించిందన్నారు. పార్టీ గుర్తించిన ప్రతీ ఒక్కరు ఈ సభ కి హాజరుకావాలి అని విజ్ఞప్తి చేశారు. రానివారు ఎటువంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదని, జిల్లా స్థాయిలో తర్వాత ప్రతినిధులు సభ జరుగుతుందని తెలిపారు. టిడిపి నాయకులు లోకేష్‌ మాట్లాడుతూ వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును అరెస్ట్‌ చేశామని చెప్పడం హాస్య స్పదంగా ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసే ఘనుడు చంద్రబాబేనని అన్నారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు.