Aug 12,2022 23:19

మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ ఎ డి విజయ ప్రసాద్‌

ప్రజాశక్తి -భీమునిపట్నం   ఖరీఫ్‌ సాగులో వ్యవసాయ శాఖాధికారుల సూచనలు పాటించాలని ఎంపిపి డివిఎస్‌ఎన్‌ఎన్‌.రాజు రైతులకు సూచించారు. స్థానిక వ్యవసాయ శాఖ ఎడి కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో మార్పులను గమనిస్తూ, ముందుకు వెళ్లాలని సూచించారు. వ్యవసాయశాఖ భీమిలి డివిజన్‌ సహాయ సంచాలకులు బి విజయ ప్రసాద్‌ మాట్లాడుతూ, పిఎం కిసాన్‌, ఇకెవైసి చేయించుకోవాలని రైతులకు సూచించారు. ఎఒ బి.శివకోమలి మాట్లాడుతూ, పంట నమోదుప్రాధాన్యతను వివరించారు.
ఆనందపురం: రైతులు పంటలు వేసే ముందు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలని ఎంపిపి డాక్టర్‌ మజ్జి శారదా ప్రియాంక సూచించారు. శుక్రవారం ఎఒ సంధ్య రత్నప్రభ ఆధ్వర్యంలో మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనందున రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్త వ్యవసాయ పరికరాలు ద్వారా అధిక దిగుబడి పొందే విధంగా కృషి చేయాలన్నారు. ఏరువాక కేంద్రం, విశాఖపట్నం సీనియర్‌ శాస్త్రవేత్త భవాని, అర్‌ఎఅర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శిరీష, భీమిలి ఎడిఎ బి.విజరుప్రసాద్‌ సాగు యాజమాన్య పద్దతులు, వ్యవసాయ సూచనలు చేశారు. వెటర్నరీ డాక్టర్‌ లీలారాణి ఆర్‌బికెల ద్వారా పశువుల దాణా, గడ్డి విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు.