Oct 21,2023 00:15

బంతిపూల రైతులతో మాట్లాడుతున్న పాదయాత్ర బృందం

ప్రజాశక్తి - రాజుపాలెం : వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నా పాలకులకు పట్టడం లేదని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి విమర్శించారు. మండ లంలో మూడ్రోజులపాటు నిర్వహించే సిపిఎం ప్రజా చైతన్య యాత్రను మండల కేంద్రమైన రాజుపాలెంలో ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కీలకమైన వ్యవసాయ రంగాన్ని పాలకులు విస్మరించారని, ఈ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం రూపొందించిన ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయ పరిస్థితు లున్నాయని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న, ప్రజల మధ్య మత విధ్వేషాలు రగిలిస్తున్న బిజెపికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన వంతపాడు తున్నాయని మండిపడ్డారు. ఇది ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఆంజనేయనాయక్‌ మాట్లాడుతూ ఎండిపోతున్న పైర్లకు కనీసం నీరైనా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కరువు పరిస్థితులు రాబోతున్నాయని, దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చర్యలు చేప ట్టాలని కోరారు. సత్వరమే ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. అనంతరం పాదయాత్ర బ్రాహ్మణపల్లి, మొక్కపాడు, రెడ్డిగూడెం, గణపవరం గ్రామాల్లో కొనసా గింది. కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.శ్రీనివాసరావు, సిహెచ్‌.రమణ, కృపారాణి, కె.శ్రీలక్ష్మి, బుజ్జి, దుర్గాబాయి, ఎం.శ్రీనివాసరావు, ఎం.బాల పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలో సిపిఎం చేపట్టిన పోరుయాత్ర శుక్రవారం 6వ రోజుకు చేరింది. గోళ్ళపాడు, కుందురువారిపాలెం, తురకపాలెం, కొంకావారిపాలెం గ్రామాల్లో బృందం పర్యటించింది. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, మండల కార్యదర్శి జి.బాల కృష్ణ మాట్లాడుతూ కనీసం రబీకైనా సాగునీరు విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే సాగు చేసిన సోయాబీన్‌, మిను ము పైర్లు నీరు లేక ఎండిపోతున్నాయని, బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జి.జాలయ్య, కె.సాంబశివరావు, కె.ప్రభాకర్‌, ఎన్‌.సాంబ శివరావు, ఐ.లింగయ్య, శ్రీను, వెంకటరెడ్డి, కె.నాగేశ్వరరావు, పి.సైదాఖాన్‌, నాగమల్లేశ్వరరావు, ఐ.సత్యనారాయణరెడ్డి, టి.బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.