Nov 18,2023 00:01

వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, గనిశెట్టి సత్యనారాయణ, బ్రహ్మాజీ తదితరులు

ప్రజాశక్తి- కశింకోట
మునగపాక మండలంలోని రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సిపిఎం నాయకులు ఆళ్ళ మహేశ్వరరావు, యస్‌ బ్రహ్మాజీ, గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. కశింకోట ఎపిఇపిడిసిఎల్‌ డివిజన్‌ కేంద్రంలో విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా విశ్రాంతి న్యాయమూర్తి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన విద్యుత్‌ వినియోగదారుల సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ పండుగ వాతావరణంలో ఇలాంటి సమావేశాలకు ఎవరు రారని, పండగ లేని రోజుల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వ్యవసాయానికి పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. అగనంపూడికి చెందిన బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ అగనంపూడి పరిధిలో విద్యుత్‌ వాడకం వల్ల దువ్వాడలో సెక్షన్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సమస్యలుంటే 1912 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్‌, సురేంద్ర కుమార్‌, హరిబాబు పాల్గొన్నారు.