
సమావేశంలో మాట్లాడుతున్న ఎఒ విజయభాస్కర్‌రెడ్డి
ప్రజాశక్తి- గిద్దలూరు రూరల్
మండలంలోని అంబవరం, వెల్లుపల్లి రైతుభరోసా కేంద్రాల్లో మండల వ్యవసాయ అధికారి వై.విజయభాస్కర్‌రెడ్డి శుక్రవారం గ్రామ వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షభావ పరిస్థితుల వలన మండలంలో కంది, పత్తి, ఆముదం, మిర్చి మొదలైన పంటలు ఎండు ముఖం పట్టినట్లు ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడానికి ఎకరాకు ఒక కేజీ చొప్పున పొటాషియం నైట్రేట్, ఎన్పికె మూడు పందొమ్ములు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుత పంటల గురించి ఎప్పటికప్పుడు పై అధికారులకు నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శేఖర్, మొహమ్మద్ నూర్, రైతులు పాల్గొన్నారు.