Aug 26,2023 20:10

పరికరాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -పొదలకూరు :సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో రైతన్నలు రారాజులుగా వెలుగొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులోని ఆర్‌ అండ్‌ బి విశ్రాంతి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు బిందు సేద్యం పరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను తాము అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల పంపిణీ వేగవంతంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని చెప్పారు.ఉద్యానవన పంటలకు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సమయంలో ..ఈ ప్రాంత నిమ్మ రైతులు నిమ్మకాయలను జగన్మోహన్‌ రెడ్డికి చూపించి తమ ఇబ్బందులను ఆయన దష్టికి తీసుకువచ్చారని చెప్పారు. పొదలకూరు సర్పంచ్‌ మల్లిక చిట్టెమ్మ, జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ ,వైసిపి నాయకులు జి. గోపాల్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి,వాకాటి శ్రీనివాస్‌ రెడ్డి, సోమా అరుణ, సోమ భాస్కర్‌, ఎం. శేఖర్‌, ఎంపిడిఒ నగేష్‌ కుమారి ఉన్నారు.