Mar 30,2023 00:13

కళాసీలు, కొలగార్లకు యూనిఫారం పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి- అనకాపల్లి
వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి కృషి చేయనున్నట్టు చైర్‌ పర్సన్‌ పలక యశోద రవి తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిపాలన భవనంలో బుధవారం ఆమె అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఏంసి అభివృద్ధికి పలు తీర్మానాలు చేశారు. ప్రధానంగా సోలార్‌ రూఫ్‌ ప్యానల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి మార్కెటింగ్‌ కమిటీ కమిషనర్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సంచాలకులకు పంపనున్నట్టు తెలిపారు. అనంతరం కొలగార్లు, కలాశీలకు రెండు జతల చొప్పున యూనిఫారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రి గ్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌ అధికారి రవి కిరణ్‌, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి శకుంతల, ఉపాధ్యక్షులు కరక సోమ నాయుడు, సభ్యులు నీటిపల్లి లక్ష్మి, మరిపల్లి శోభ, బొబ్బిలి శ్యామల ఈగల నూకరత్నం, దాడి తులసి, బొడ్డు అచ్చిరాజు, ఒమ్మి మధు, దాడి కుమార్‌, గుండా రమేష్‌ గుప్తా, మార్కెట్‌ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.