ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని వామపక్ష రైతు, కార్మిక సంఘ నాయకులు గోవిందు, హనుమంతు, పంపన్న గౌడ్, రాజు, సత్తన్న, సంజీవ కోరారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కేంద్ర కార్మికులు సమన్వయ కమిటీ పిలుపుమేరకు 'బ్లాక్ డే' చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ సర్కిల్, సోమప్ప సర్కిల్, గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులపై కాల్పులు జరిపి ప్రాణాలను బలి తీసుకున్న ఘటనకు బాధ్యుడైన మంత్రిని బర్తరఫ్ చేయనందుకు, బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, పేదలు, కార్మికులు, సామాన్యుల ప్రయోజనాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలను మాఫీ చేసేందుకు మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్లకు లాభాలు పెంచి ప్రజల సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్లను తరిమికొట్టాలని కోరారు. రైతు, కార్మిక సంఘాలు, యువజన సంఘం నాయకులు లక్ష్మీనరసయ్య, అబ్దుల్, ప్రసాద్, బాలు రాజు, రాముడు, సురేష్, జబ్బార్, వీరేష్, సుంకన్న, రామాంజనేయులు, భీమన్న, నాగప్ప, బాష, రాజు, రాముడు, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆస్పరి చౌరస్తాలో ప్రజా సంఘాల నల్ల రిబ్బను కళ్లకు కట్టుకుని నిరసన చేపట్టారు. ముఖ్య అతిథిగా వ్యకాస జిల్లా కార్యదర్శి కెవి.నారాయణ హాజరయ్యారు. రైతు, వ్యకాస నాయకులు హనుమంతు, బాలకృష్ణ, రంగస్వామి, మల్లేష్, మధురెడ్డి, రామాంజినేయులు, రంగప్ప, ఈరన్న, వీరేష్, శివ, లక్ష్మన్న, సురేంద్ర, నరేంద్ర, ఏసోపు, ప్రకాష్ పాల్గొన్నారు. దేవనకొండలో తహశీల్దార్ కార్యాలయం దగ్గర గాంధీ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. వ్యకాస మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ బాష అధ్యక్షత వహించారు. వ్యకాస జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, సిఐటియు సీనియర్ నాయకులు నాగేష్, మండల కార్యదర్శి అశోక్, రైతు సంఘం మండల కార్యదర్శి సూరి, ప్రజాసంఘాల నాయకులు రంగన్న, మహేంద్ర, రాము, రాముడు, శ్రీనివాసులు, సుంకన్న, సుధాకర్ పాల్గొన్నారు. మంత్రాలయం తహశీల్దార్ కార్యాలయం వద్ద నరసన చేపట్టారు. సిఐటియు మండల కార్యదర్శి హెచ్.జయరాజు, నాయకులు వీరేష్, ఎస్.వీరేష్, టి.ప్రాణేష్, జి.అంజి, లక్ష్మన్న పాల్గొన్నారు. గోనెగండ్లలోని ఎమ్మిగనూరు, కర్నూలు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు, ఎఐటియుసి నాయకులు రాముడు నాగప్ప, సిఐటియు నాయకులు వీరేష్, లింగన్న, వెంకటేష్, చాంద్, రాకేష్, రవి, నాగేష్, మున్నా, వీరేష్ నాయుడు పాల్గొన్నారు. ఆలూరు అంబేద్కర్ సర్కిల్‌లో సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణ స్వామి, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు, సిఐటియు మండల ఉపాధ్యక్షులు షాకీర్, మండల నాయకులు శేఖర్, విఠల్, హమాలీ యూనియన్ నాయకులు నాగరాజు, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైనా, ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఎఐటియుసి తాలూకా అధ్యక్షులు శివ, హమాలీ యూనియన్ నాయకులు మల్లికార్జున, నాగరాజు, బండయ్య, రామాంజనేయులు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరులో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు










