Mar 10,2021 06:54

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే నష్టపోయేది పేద రైతులు, కౌలు రైతులే. ఈ చట్టాలలో మొదటిది రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక-సులభతర) చట్టం. ఈ చట్టం ప్రకారం రైతులు, కౌలు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఆ రకమైన స్వేచ్ఛ ఉంది. ఎటువంటి ఆంక్షలు లేవు. దేశంలో 86 శాతం చిన్న, సన్నకారు కౌలురైతులే. పండించిన పంటలను పొలం నుండి ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ఖర్చవుతుంది. కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్థితిలో రైతులు ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్ళి తమ పంటలను అమ్ముకొనే అవకాశమే ఉండదు. ఈ చట్టం వలన లాభపడేది కార్పొరేట్‌ సంస్థలే. కౌలురైతులు దివాళా తీసి అప్పుల పాలవుతారు. పైగా మన రాష్ట్రంలో కౌలు వ్యవసాయం వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లో నడుస్తోంది. వారే ధాన్యం వ్యాపారస్తులుగాను, కమీషన్‌ ఎజంట్లుగాను ఉన్నారు. పండించిన పంటలను వారికి అమ్ముకోవాలి. అప్పులు తీరిన తరువాత మిగిలిన సొమ్ము కౌలు రైతులకు అందుతుంది. అలాంటప్పుడు కౌలు రైతులకు, పేద రైతులకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పంటలను కొనుగోలు చేస్తోంది. ఆ సమయంలో వ్యపారస్తులు కూడా పోటీపడి కొంత రేట్లు పెంచి కొంటారు. కాని ఈ చట్టాలు దాన్ని ఆపేశాయి. స్వేచ్ఛా మార్కెట్‌ పేరుతో వ్యాపారస్థులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరలకే కొని...ధరలు పెరిగాక అమ్ముకుంటారు. పేద రైతులు, కౌలు రైతులు నష్టపోతారు.
రెండోది రైతు (సాధికారత-రక్షణ) ధరల హామీ-సేవల ఒప్పంద చట్టం. దీనిని కాంట్రాక్ట్‌ వ్యవసాయ చట్టమని, వ్యవసాయ ఒప్పంద చట్టమని అంటారు. పెద్ద కంపెనీలు తమకు లాభాలు సమకూర్చే పంటలు పండించమని రైతులతో ఒప్పందం చేసుకుంటాయి. ఒప్పందం ప్రకారం పంటలను కొంటారని గ్యారంటీ లేదు. ఎందుకు కొనరని న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం లేదు. ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం కౌలు రైతులు భూమి నుండి గెంటివేయబడతారు. గ్రామాల్లో భూ యజమానులు కౌలురైతులకు లిఖిత పూర్వకమైన ఒప్పందం రాసి ఇవ్వాలి. అలా ఇస్తేనే కౌలు రైతుల కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఇది సాధ్యం కాదు కాబట్టి భూయజమానులే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. పర్యవసానంగా కౌలు రైతులు భూముల నుండి నెట్టివేయబడతారు. రైతులతో నేరుగా ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఒప్పంద పత్రాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటాయి. లాభాలు వచ్చే వరకు బాగానే ఉంటుంది. నష్టాలు వస్తే కంపెనీలు దివాళా తీసి పారిపోతాయి. ఆ రైతుల భూములను బ్యాంకులకు స్వాధీనం చేసుకుంటాయి. అలా ఈచట్టం రైతాంగాన్ని భూమి లేని బికారులను చేస్తుంది.
మూడోది నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం. కేంద్ర ప్రభుత్వం 1955 నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించింది. వ్యాపారస్తులు వ్యవసాయ ఉత్పత్తులను అపరిమితంగా నిల్వ చేసుకొని అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఇచ్చింది. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, ధాన్యం, ఆయిల్‌ ఉత్పత్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు నిలవబెట్టుకొని, ఎగుమతి చేయడానికి, లేదా దిగుమతి చేసుకోవడానికి ఈ సవరణ చట్టం తెచ్చింది. ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని నిలవబెట్టుకుని (బ్లాక్‌ మార్కెట్‌ సృష్టించి) బయట మార్కెట్లో సరుకులు అందుబాటులో లేనప్పుడు ధరలు పెంచి పేద ప్రజలను కొల్లగొట్టడానికి...బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యాపారస్థులకు అనుకూలంగా చట్టాన్ని తెచ్చింది. ఈ విధంగా ఉత్పత్తిదారులుగాను, వినియోగదారులుగాను కౌలు రైతులు, పేద రైతులు నష్టపోతారు.
నాల్గోది విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లు-2020. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తోందివ్యవసాయ చట్టాలతో కౌలు రైతుకు నష్టంకేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే నష్టపోయేది పేద రైతులు, కౌలు రైతులే. ఈ చట్టాలలో మొదటిది రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక-సులభతర) చట్టం. ఈ చట్టం ప్రకారం రైతులు, కౌలు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఆ రకమైన స్వేచ్ఛ ఉంది. ఎటువంటి ఆంక్షలు లేవు. దేశంలో 86 శాతం చిన్న, సన్నకారు కౌలురైతులే. పండించిన పంటలను పొలం నుండి ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ఖర్చవుతుంది. కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్థితిలో రైతులు ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్ళి తమ పంటలను అమ్ముకొనే అవకాశమే ఉండదు. ఈ చట్టం వలన లాభపడేది కార్పొరేట్‌ సంస్థలే. కౌలురైతులు దివాళా తీసి అప్పుల పాలవుతారు. పైగా మన రాష్ట్రంలో కౌలు వ్యవసాయం వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లో నడుస్తోంది. వారే ధాన్యం వ్యాపారస్తులుగాను, కమీషన్‌ ఎజంట్లుగాను ఉన్నారు. పండించిన పంటలను వారికి అమ్ముకోవాలి. అప్పులు తీరిన తరువాత మిగిలిన సొమ్ము కౌలు రైతులకు అందుతుంది. అలాంటప్పుడు కౌలు రైతులకు, పేద రైతులకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పంటలను కొనుగోలు చేస్తోంది. ఆ సమయంలో వ్యపారస్తులు కూడా పోటీపడి కొంత రేట్లు పెంచి కొంటారు. కాని ఈ చట్టాలు దాన్ని ఆపేశాయి. స్వేచ్ఛా మార్కెట్‌ పేరుతో వ్యాపారస్థులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరలకే కొని...ధరలు పెరిగాక అమ్ముకుంటారు. పేద రైతులు, కౌలు రైతులు నష్టపోతారు.
రెండోది రైతు (సాధికారత-రక్షణ) ధరల హామీ-సేవల ఒప్పంద చట్టం. దీనిని కాంట్రాక్ట్‌ వ్యవసాయ చట్టమని, వ్యవసాయ ఒప్పంద చట్టమని అంటారు. పెద్ద కంపెనీలు తమకు లాభాలు సమకూర్చే పంటలు పండించమని రైతులతో ఒప్పందం చేసుకుంటాయి. ఒప్పందం ప్రకారం పంటలను కొంటారని గ్యారంటీ లేదు. ఎందుకు కొనరని న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం లేదు. ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం కౌలు రైతులు భూమి నుండి గెంటివేయబడతారు. గ్రామాల్లో భూ యజమానులు కౌలురైతులకు లిఖిత పూర్వకమైన ఒప్పందం రాసి ఇవ్వాలి. అలా ఇస్తేనే కౌలు రైతుల కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఇది సాధ్యం కాదు కాబట్టి భూయజమానులే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. పర్యవసానంగా కౌలు రైతులు భూముల నుండి నెట్టివేయబడతారు. రైతులతో నేరుగా ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఒప్పంద పత్రాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటాయి. లాభాలు వచ్చే వరకు బాగానే ఉంటుంది. నష్టాలు వస్తే కంపెనీలు దివాళా తీసి పారిపోతాయి. ఆ రైతుల భూములను బ్యాంకులకు స్వాధీనం చేసుకుంటాయి. అలా ఈచట్టం రైతాంగాన్ని భూమి లేని బికారులను చేస్తుంది.
మూడోది నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం. కేంద్ర ప్రభుత్వం 1955 నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించింది. వ్యాపారస్తులు వ్యవసాయ ఉత్పత్తులను అపరిమితంగా నిల్వ చేసుకొని అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఇచ్చింది. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, ధాన్యం, ఆయిల్‌ ఉత్పత్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు నిలవబెట్టుకొని, ఎగుమతి చేయడానికి, లేదా దిగుమతి చేసుకోవడానికి ఈ సవరణ చట్టం తెచ్చింది. ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని నిలవబెట్టుకుని (బ్లాక్‌ మార్కెట్‌ సృష్టించి) బయట మార్కెట్లో సరుకులు అందుబాటులో లేనప్పుడు ధరలు పెంచి పేద ప్రజలను కొల్లగొట్టడానికి...బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యాపారస్థులకు అనుకూలంగా చట్టాన్ని తెచ్చింది. ఈ విధంగా ఉత్పత్తిదారులుగాను, వినియోగదారులుగాను కౌలు రైతులు, పేద రైతులు నష్టపోతారు.
నాల్గోది విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లు-2020. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తోంది. మన రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ సిపి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ''ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని'' రద్దు చేసి దాని స్థానంలో ''వైయస్సార్‌ వ్యవసాయ విద్యుత్‌ నగదు బదిలీ పథకం'' తీసుకు వచ్చింది. రాష్ట్రంలో 18 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వీటి ద్వారా 30 లక్షల ఎకరాలు పైగా సాగవుతోంది. ఈ భూములను కౌలు రైతులే సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్తు మోటార్లకు మీటర్లు పెట్టి , బ్యాంకులో రైతు పేరుతో ఖాతా తెరచి ఆ రైతు ఖాతాలో బిల్లు డబ్బులు మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు ఖాతాలో డబ్బులు వేయకపోతే నూతన విద్యుత్‌ విధానం వలన వెంటనే కరెంటు కట్‌ అవుతుంది. పంటలు ఎండిపోతాయి. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారు. అంటే ఒకరకంగా పంటలు ఎండిపోవడంతో పాటు రెండో వైపు భూయజమానులు స్థానికంగా ఉండరు కాబట్టి కరెంట్‌ బిల్లు భారం కౌలు రైతుల మీద పడుతుంది. అన్ని రకాలుగా కౌలు రైతులు నష్టపోతారు. అందువల్లే ఈ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. డా||స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. కౌలురైతులకు రక్షణ, సంక్షేమం కోసం సమగ్రమైన చట్టం తేవాలని పోరు బాటలో ముందుకు సాగుతున్నారు.
                వ్యవసాయ చట్టాలతో కౌలు రైతుకు నష్టం       - జమలయ్య  / వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /