Aug 29,2023 20:45

గిడుగు చిత్రపటానికి నివాళ్లులర్పిస్తున్న ఎస్‌పి

వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు 'గిడుగు'
- జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి - ఘనంగా గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి వేడుకలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

        వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు వెంకట రామ్మూర్తి అని, తెలుగు భాష అభ్యున్నతికి ఆయన ఎనలేని సేవ చేశారని జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి తెలిపారు. గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్‌పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ గ్రాంధిక భాషను పండితుల నుండి పామర జనాలకు చేరవేసే దిశగా నిరంతరం కృషి చేసిన తెలుగు భాషోద్యమ స్ఫూర్తి దాత గిడుగు వెంకట రామ్మూర్తి అన్నారు. మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులను, మాతృభాషను మరువరాదని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ వెంకటరాముడు, స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్పి జెవి సంతోష్‌, ఏఏఓ నిజాముద్దీన్‌, ఆర్‌ఐలు సుధాకర్‌, శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఐలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు, జిల్లా పోలీస్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే నంద్యాల ఆర్టీసీ డిపోలో తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. తెలుగు బాషా గొప్పదనాన్ని హయగ్రీవ అచారి వివరించారు. డిఎం ఎ.గంగాధర రావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ సి.మద్దిలేటి నాయుడు పాల్గొన్నారు. నంద్యాల : నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ నందు గల శ్రీ గురుగాజ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు డైరెక్టర్‌ షేక్షావలి రెడ్డి తెలిపారు. జూనియర్స్‌ విభాగంలో లేఖారచన, సీనియర్స్‌ భాగంలో కవితా రచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రామాయణం, భాగవతం, పంచతంత్రం, విద్యార్థి కల్పవృక్షం పుస్తకాలను డైరెక్టర్‌ షేక్షావలి రెడ్డి అందజేశారు. పాణ్యం : విజయానికేతన్‌ పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్‌ విజయ కుమార్‌ రెడ్డి మాట్లాడూ పర భాష లు ఎన్ని వున్నా మాతృభాషకు ఏవీ సాటి రావని అన్నారు. పాఠశాల అకడమిక్‌ ఇంఛార్జి మురారి వేణుగోపాల్‌ మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగును వ్యవహారిక భాషాగా మార్చేందుకు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కో ఆర్డినేటర్‌ బ్రహ్మం, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బనగానపల్లె : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో మాఋభాషా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ స్వర్ణలతాదేవి, హరినాథ్‌ గౌడ్‌, తెలుగు శాఖాధిపతి డాక్టర్‌ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్‌ బడే సాహెబ్‌, డాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, డాక్టర్‌ రామకృష్ణ, ఉమామహేశ్వర్‌ రెడ్డి, వరలక్ష్మి, కౌశల్యదేవి, రవికుమార్‌, వహీదా, విద్యార్థులు పాల్గొన్నారు. కొలిమిగుండ్ల : కొలిమిగుండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎపి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడు వైవిఎస్‌ నారాయణరెడ్డిని, చెన్నకేశవులును, పిల్లా సుబ్బయ్యను సన్మానించారు. అలాగే క్రీడా దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు కంబగిరిని సన్మానించారు. అనంతంర ఎంఇఒలు రాజయ్య, అబ్దుల్‌ కలాంలను సన్మానించారు. ఇన్చార్జి హెచ్‌ఎం హుస్సేనయ్య పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : పట్టణంలోని కెవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవం వేడుకలు నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరక్టర్‌ భూమా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మహానంది : మహానంది మండలం తిమ్మాపురంలోని మోడల్‌ పాఠశాలలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎంఇఒ రామసుబ్బయ్య, తెలుగు పాఠ్య రూపకర్త డాక్టర్‌ నరేష్‌ బాబు, ప్రిన్సిపల్‌ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఆత్మకూర్‌: పట్టణంలోని జి. పుల్లారెడ్డి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి నిర్వహించారు. అకాడమిక్‌ డైరెక్టర్‌ శ్రీసాయి ప్రణీత్‌, హెచ్‌ఎం చాంద్‌ బాషా పాల్గొన్నారు. అలాగే వెంకటాపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు.