Aug 29,2023 20:48

గిడుగు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డిఆర్‌ఒ గంగాధర్‌గౌడ్‌

 కడప గ్రాంధి భాషలో కఠినంగా ఉన్న తెలుగు వచనాన్ని వ్యవహారిక భాషలోకి తీసుకొని వచ్చి భాషలోని అందాన్ని వెసులుబాటును లోకానికి అందజేసిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి అని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి సంస్మరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాష దినోత్సవం గా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు భాషా ప్రేమికుడు భాషా సామాజిక సంస్కర్త గిడుగు రామ్మూర్తి అని ప్రముఖ న్యాయవాది అమీన్‌ పీరా అన్నారు. మంగళవారం నాగరాజపేటలోని నగరపాలక ఉన్నత పాఠశాల లో ఘనంగా గిడుగు రామ్మూర్తి జయంతి కార్యక్రమాన్ని రాయల్‌ కరీం సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆర్ట్స్‌ కళాశాలలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో గత ఆరు రోజులపాటు నిర్వహించిన తెలుగు భాష వారోత్సవాలు మంగళవారం ముగిశాయి. వారోత్స వాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాల్లో సాంస్కతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి. రవీంద్రనాథ్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఎం. రమేష్‌, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్‌ సుందరేశ్వర రావు, అధ్యాపకులు హజరత్‌ అయ్యా, డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ రాజీవ్‌ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో
కడప అర్బన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గిడుగు రామమూర్తి జయంతి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ లైబ్రేరియన్‌ పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుందని పేర్కొన్నారు. అతని రచనా వైవిద్యం, వైశి ష్ట్యంతో పుష్టిచేకూరిందని పేర్కొన్నారు. మన మందరం తెలుగు భాషా అభి వద్దికి పాటుపడాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది సీనియర్‌ అసిస్టెంట్‌ రాజ్‌ కుమార్‌, శ్రీనివాస చారి, జిల్లా కేంద్ర గ్రంథా లయ సిబ్బంది బాబ్జి, సుబ్రమణ్యం,రమణ,శేఖర్‌ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
కలసపాడు : మండలంలోని స్థానిక సెయింట్‌ ఆంటోనీ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా మొదట తెలుగు అధ్యాప కురాలు, వసంత కుమారి గిడుగు రామ్మూర్తి గురించి విశదీకరించారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు లూరు ్దయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
వేంపల్లె : తెలుగు భాషోద్ధరణకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషి ఎనలేనిదని పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి పేర్కొన్నారు. గిడుగు రామ్మూర్తి 160వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో గిడుగు చిత్ర పటానికి తులసిరెడ్డి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో బాలికల, బాలుర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నారాయణమ్మ, భారతి, తెలుగు అధ్యా పకులు చెరుకూరి శ్రీనివాసులు, ఉషారాణి, శేష శైలజ, శారదాదేవి, కృష్ణవేణి, ఆవుల వెంకట్‌, కాంగ్రెస్‌ నాయకులు ఉత్తన్న, వేమయ్య, బాలం సుబ్బరాయుడు రామకృష్ణ, నిసార్తో అహమ్మద్పా, ప్రభాకర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాపాడు : మైదుకూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగ ళవారం ఉపాధ్యాయులు పద్మజ అధ్యక్షతన తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుడు, తెలుగు సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు తవ్వా ఓబులరెడ్డి మాట్లాడుతూ మాతృభాషను విస్మరిస్తే తమ తల్లిని విస్మరి ంచినట్లే అన్నారు. కార్యక్రమంలో ఆవుల శ్రీనివాసులు, తెలుగు ఉపాధ్యాయులు ఎస్‌.వెంకటేశ్వర్లు, చౌడేశ్వరి, ఉపా ధ్యాయులు ఎల్‌.సూర్యనారాయణరెడ్డి, రామ్మోహన్‌, ప్రకాశ్‌, ఆనందరావు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : స్థానిక శ్రీరాములపేటలోని ఉపాథ్యాయ సేవా కేంద్రంలో మంగళవారం వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, హాకీ క్రీడాకారుడు మేజర్‌ థ్యాన్‌చంద్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గిడుగు రామ్మూర్తి చిత్ర పటానికి ప్రముఖ కవి జింకా సుబ్రమణ్యం, మేజర్‌ థ్యాన్‌చంద్‌ చిత్రపటానికి విశ్రాంతి వ్యాయామ ఉపాథ్యాయులు ఓబులరెడ్డి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఉపాథ్యాయ సంఘాల సమన్వయవేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ వాడుక భాషను వేడుక భాషగా చేసిన మహనీయుడు గిడుగు అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ భాగ వతార్‌ యడవల్లి రమణయ్య, భాష ప్రేమికులు హరి, వెంకటేష్‌ పాల్గొన్నారు.