Jun 20,2023 00:23

డస్ట్‌ బిన్లు పంపిణీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు

సత్తెనపల్లి రూరల్‌: వ్యర్థాల సమగ్రంగా నిర్వహించాల్సిన బాధ్యత అంద రిపై ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పట్టణం లోని 15 వ వార్డు కౌన్సిలర్‌ గంట రవణమ్మ ఆధ్వర్యంలో సోమవారం డస్ట్‌ బిన్లు పం పిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ వ్యర్థాలను సమగ్రంగా నిర్వహిం చడం ద్వారా వ్యాధుల నివారణే కాకుండా, మున్సిపాలిటికి, వ్యక్తిగతంగా కుటుంబాలకు కూడా ఆదాయం, ఆరోగ్యం లభిస్తాయన్నారు. పారిశుధ్యంతో పాటు ప్రజా ఆరోగ్యం మెరుగుదలే లక్ష్యమని చెప్పారు. కుటుంబాల నుంచి వచ్చే వ్యర్థా లలో తడి- పొడి వాటిని వేరు చేసే విధానంపై అవగాహన కల్పించి గృహిణుల బాధ్యతను గుర్తుచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. స్వచ్ఛత సహకారానికి, పరిశుభ్రమైన సత్తెనపల్లిని నిర్మిం చేం దుకు కలిసికట్టుగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సి పల్‌ కమిషనర్‌ కె.షమీ, వైస్‌ చైర్మన్‌ కోటేశ్వరరావునాయక్‌, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రదరావు పాల్గొన్నారు.