వయోజనులకు కిట్లను పంపిణీ చేస్తున్న ఎంపిపి శెట్టి పద్మావతి
ప్రజాశక్తి - కురుపాం : నిరక్షరాస్యత నిర్మూలనకు వయోజన విద్యా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి శెట్టి పద్మావతి అన్నారు. సోమవారం కురుపాంలో గాంధీనగర్ వీధి వద్ద స్వచ్ఛ హృదయ సేవా వికాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన వయోజన విద్యా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరక్షరాస్యత వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందరూ అక్షరాస్యులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం వయోజనులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ షేక్ ఆదిల్, సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎం.భీష్మారావు, వయోజన విద్యా సిబ్బంది మురళి, చిట్టిబాబు పాల్గొన్నారు.










