Oct 30,2023 23:39

ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ, రామకృష్ణ సేవా సమితి సంయుక్తంగా బిటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్ధులకు వ్యక్తిత్వ వికాసంపై సోమవారం సెమినార్ నిర్వహించినట్లు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి చదువుతోపాటు వ్యక్తిత్వ విలువలు, సేవాతత్వం అవర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం వేణు గోపాలరావు తెలిపారు. ఈ సదస్సులో విజయగనరంకు చెందిన స్వామి అర్చనానంద మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న సమయంలోనే వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలని అన్నారు. అలాంటి విద్యార్ధులు సమాజంలో ఎటువంటి కష్టాన్నైనా సమర్ధవంతంగా ఎదుర్కోగలరని వివరించారు. మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసిన వ్యక్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటాడని తెలిపారు. ప్రతివ్యక్తిలో అనంతమైన శక్తి, ప్రతిభ, సామర్థ్యం దాగి ఉన్నాయిని, వాటిని ధృడ సంకల్పంతో వెలికి తీసినట్టైతే అనుకున్నది సాధించగలరని తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చెప్పిన సూక్తులు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధించారు. ఈ సదస్సులో ఇసిఇ విభాగాధిపతి కె జగదీష్ బాబు పాల్గొన్నారు.