Sep 02,2023 20:53

సమావేశంలో మాట్లాడుతున్న రెండవ అదనపు జడ్జి శంకర్‌

రాజంపేట అర్బన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, జీవనాభివద్ధి అనే అంశాలపై స్టెప్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజంపేట రెండవ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ పసుపులేటి శంకర్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంపై నమ్మ కంతో ముందడుగు వేయాలని సూచించారు. స్వామి వివేకానంద, అబ్దుల్‌ కలాం వంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఎదగాలని తెలిపారు. పట్టుదల, కషితో ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ కె.వెంకట నరసయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు ఇంతటి అమూల్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు న్యాయమూర్తి శంకర్‌కు ధన్య వాదాలు తెలిపారు. స్టెప్‌ మేనేజర్‌ సుబ్బరాయుడు మాట్లాడుతూ త్వరలో జరగనున్న యూత్‌ ఫెస్టివల్‌ ప్రభుత్వ కళాశాలలోనే నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ మేజర్‌ విజయభాస్కర్‌, కళాశాల సిబ్బంది మహబూబ్‌బాషా, రామకృష్ణ, శివరామిరెడ్డి, చంద్రమో హన్‌, చాన్‌బాష, కె.వి రమణ, పార్వతి, నాగరాజ పాల్గొన్నారు.