మాట్లాడుతున్న ఐద్వా నేతలు
ప్రజాశక్తి -నాతవరం:తాండవ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన తాపీ మేస్త్రి పిలక రమణ పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలభారత ప్రజా తంత్ర మహిళా సంఘం(ఐద్వా) నేతలు డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు కెవి సూర్యప్రభ, మండల కార్యదర్శి బి లావణ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు విద్యార్థిని కుటుంబ సభ్యులను, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులను జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు కేవీ సూర్యప్రభ మాట్లాడుతూ, విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన పిలక రమణపై పోస్కో, నిర్భయ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యా యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.










