ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
పరిశుభ్రత అనేది ఒక అలవాటుగా మారాలని, ఇల్లు, పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్‌ఎస్‌ఆర్‌కె వరప్రసాద్‌రావు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్‌లో భాగంగా శ్రమదానంను రెడ్‌క్రాస్ కార్యాలయం ఆవరణలో సంస్థ సిబ్బంది ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ వాలంటీర్లు, ఎఎన్‌ఎం, నర్సింగ్ విద్యార్థినిలు పాల్గొని శ్రమదానం చేశారు.
ఏలూరులో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎపిఎస్‌ఆర్‌టిసి బస్టాండ్, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి వారి కార్యాలయంలో బయట ఉన్నటువంటి మొక్కలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఎన్‌విఆర్ వరప్రసాద్, ఆఫీసు సూపర్‌నెంట్ పి.వేణుగోపాలరావు, ఏలూరు డిపో మేనేజర్ బి.వాణి పాల్గొన్నారు.
ఇరిగేషన్ కార్యాలయాల సమూహంలో పశ్చిమగోదావరి జిల్లా ఎపి ఎన్‌జిఒస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. కార్యాలయాల ఆవరణలో పేరుకు పోయిన చెత్త, పిచ్చిమొక్కలని తీసివేసి పరిసరాలను శుభ్రపరిచారు.










