Sep 14,2023 21:04

పులివెందుల : మీడియాతో మాట్లాడుతున్న బిటెక్‌ రవి

పులివెందుల రూరల్‌ : వ్యక్తిగత కక్షతోనే జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేయించారని మాజీ ఎమ్మెల్సీ, బిటెక్‌ రవి, నాయ కులు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్ర బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుకు మేమున్నాము అంటూ టిడిపి నాయకులు పులివెందుల పట్టణంలోని కార్యాలయం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి పదవి చేపట్టిన వారు రాగద్వే షాలుగాతీతంగా ప్రజలకు పరిపాలన అందించాలని అలాకాకుండా ప్రభుత్వం వచ్చిందని ప్రతిపక్షాలపై కక్ష కట్టి వారిని అరెస్టు చేయించడం వీళ్లకు పరిపాటైందన్నారు. రిలే దీక్షల్లో సింహాద్రిపురం మండలం నాయ కులు ముసంరెడ్డిపల్లె రఘునాథ్‌రెడ్డి, జోగిరెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ తుగుట్ల రాఘవరెడ్డి, పులివెందుల మాజీ పట్టణ అధ్యక్షులు వెంకట రామిరెడ్డి, భాస్కర్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ప్రసాద్‌రెడ్డి, అక్కులగారి విజరు కుమార్‌రెడ్డి, మైసూరారెడ్డి పాల్గొన్నారు. కడప అర్బన్‌ : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నగరంలోని చిన్నచౌక్‌ ప్రధాన రోడ్డు వద్ద ఆ పార్టీ నాయకులు కొమ్మలపాటి సుబ్బరాయుడు, ద్వారక, నాగేశ్వరరావు, నాగ రాజు, సునీత, పార్వతి, రామలక్ష్మమ్మ, కళావతి, స్వర్ణ, సజుమ, రాఘవ నిరాహార దీక్షలను చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, నాయకులు సానపురెడ్డి రవి శంకర్‌రెడ్డి. కిరణ్‌, అంజి పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : టిడిపి ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి ఆధ్వ ర్యంలో పాతబస్టాండ్‌లో రెండో రోజు రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షలో కొండాపురం మండలం నాయకులు సత్యనారాయణరెడ్డి, రామిరెడ్డి, శంకర్‌ రెడ్డి, నాగేశ్వర్‌ రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, నాగేష్‌, రామ ప్రసాద్‌రెడ్డి, రంగారెడ్డి, కష్ణారెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. చాపాడు : ప్రభుత్వ అసమర్ధతను ప్రజలకు తెలిపే బాధ్యత టిడిపి కార్యకర్తలపై ఉందని టిడిపి రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మల్లెల లక్ష్మీ ప్రసన్న తెలిపారు. మైదుకూరులో టిడిపి నాయకులు తలపెట్టిన 2వ రోజు రిలే నిరాహార దీక్షలో చాపాడు మండల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు అన్నవరం సుధాకర్‌ రెడ్డి, బిసి నాయకులు మేకల బాబు, జిల్లా అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి, నాయకులు వైవి సుబ్బారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, సుదర్శన్‌, నాగరాజు, నారాయణ, నారపురెడ్డి, వెంకట రమణారెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్రొద్దుటూరులోని ధర్నా చౌక్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బాలుడు, తలారి పుల్లయ్య, ఎర్రన్న, రామచంద్రారెడ్డి, వుండేల నారాయణరెడ్డి, నాయకులు ఘంటసాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఖాజీపేట : చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు చర్య అని టిడిపి రాష్ట్ర మాజీ కార్య నిర్వాహక కార్యదర్శి ఆర్‌.వి.సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రికి వెళ్లి లోకేష్‌కు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యకులు కొత్తపు మునిరెడ్డి, నాయకులు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.