Sep 27,2023 17:25

రిలే నిరాహార దీక్షలో కూర్చున్న టిడిపి యాదవ సంఘం నాయకులు

వ్యక్తిగత కక్షతోనే చంద్రబాబు అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే బిసి
ప్రజాశక్తి బనగానపల్లె

     స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత కక్షతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయ సమీపంలో టిడిపి యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా 15 వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్షలో టిడిపి యాదవ సంఘం నాయకులు కటికవానికుంట బాలరాజు యాదవ్, పర్లపాటి నాగార్జున యాదవ్, చెంచుబోయిన వెంకట రాముడు యాదవ్, క్రిష్ణగిరి రంగస్వామి యాదవ్, చెర్లొ కొత్తూరు తిమ్మరాజు యాదవ్, మంగంపేట కంబగిరి యాదవ్ ప్రసాద్ యాదవ్ ,రామ మద్దిలేటి యాదవ్ , మల్లికార్జున యాదవ్, లతోపాటు నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు.దీక్షలో కూర్చున్న వారికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి , టిడిపి బనగానపల్లె నియోజకవర్గం పరిశీలకులు బాజీ చౌదరి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు . ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే  బీసీ జనార్దన్ రెడ్డి  మాట్లాడుతూ  నారా చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేసి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు  చూపకుండా లేదన్నారు.  చంద్రబాబుపై కేవలం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడుకు ఇలాంటి సంబంధంలేని,  ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారన్నారు.నారా చంద్రబాబునాయుడుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తి  దిక్కు తోచక   అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.ఆధారాలు ఉంటే నిరూపించాలని వైసీపీ ప్రభుత్వానికి,అధికారులకు సవాళ్లు సవాల్ విసిరారు .వైసిపి పార్టీ గాలికి వచ్చిందని  గాలిలోనే కలిసిపోతుందన్నారు.ఎన్ని అక్రమ కేసులు పెట్టిన మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని త్వరలోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల అవుతారని అన్నారు.  దీక్ష లో కూర్చున్న టీడీపీ యాదవ సంఘం నాయకులకు,  టిడిపి నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు . ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి, టిడిపి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కృష్ణా నాయక్, టిడిపి పట్టణ అధ్యక్షులు ఖాసింబాబు, మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రాయలసీమ సలాం, నాయకులు టిప్ టాప్ కలాం లాయర్ నాగేందర్ రెడ్డి, ఖాదర్ బాషా, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు