ప్రజాశక్తి-మైలవరం
వచ్చే నెల డిసెంబర్ 8,9,10 తేదీలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆ సంఘం నాయకులు పుల్లూరులో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట.కళ్యాణ్ మాట్లాడుతూ ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, రైతాంగ పోరాటాలు భూ పోరాటాలు కూలి పోరాటాలు అనేక పోరాటాలకు నిర్వహించి నటువంటి ఉద్యమాలు చేసిన నాయకులు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారన్నారు. భూ సమస్య పైన వివిధ రూపాలలో వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లాలోను మైలవరం ప్రాంతాల్లో అనేకమైన సమరశీల పోరాటాలు నిర్వహించిందని అన్నారు. సంపన్న వర్గాలు ఆక్రమించుకున్న అసైన్డ్ సీలింగు, ఫారెస్ట్ భూములపై వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం పోరాడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా పేదల ఇళ్ల స్థలాల కోసం ఉపాధి హామీ చట్టం కోసం, కూలి పోరాటాలు నిర్వహించిందని ఆయన అన్నారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు రావూరి రామారావు, కూలీ మేస్త్రి ఇంజమూరు.నాగమణి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు లంకా. వెంకటేశ్వర్లు గురజాల. రామారావు భీమడోలు ముత్తయ్య బోడే. రామారావు, పత్తిపాటి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.










