Dec 06,2022 22:36

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
        ఈనెల ఏడో తేదీన స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాచరచన పోటీలు నిర్వహిస్తున్నామని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం కార్యదర్శ ఎ.రవి తెలిపారు. స్థానిక బస్టాండ్‌ పక్కన ఉన్న కుంజా బొజ్జి, సున్నం రాజయ్య సభా ప్రాంగణంలో సాయంత్రం నాలుగు గంటలకు సాంస్కృతిక సమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరావు పాల్గొంటారని తెలిపారు. దేశభక్తి, అభ్యుదయ పాటల పోటీలు, వివిధ కళా పోటీలు నిర్వహించి సాయంత్రం ఏడు గంటలకు విజేతలకు ప్రజాకవి, తెలంగాణ ఎంఎల్‌సి గోరేటి వెంకన్న ద్వారా బహుమతులు అందజేస్తామని తెలిపారు.
జండా ఆవిష్కరణలు
గణపవరం:వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా మండలంలో జల్లి కాకినాడ, కేశవరం గ్రామాల్లో మంగళవారం జెండా ఆవిష్కరణలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నరాలశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో ఈనెల 8,9,10 తేదీల్లో ప్రారంభమైన రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు సుబ్రహ్మణ్యం, సంజీవరావు, శ్రీను, మహేష్‌, నాగేశ్వరరావు, మరియమ్మ, పల్లయ్య పాల్గొన్నారు.