Nov 27,2022 21:20

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
       ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వచ్చేనెల 8, 9, 10 తేదీల్లో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ పోస్టర్లను ఆదివారం సరిపల్లిలో పంపిణీ చేశారు. ఉపాధి కూలీలకు కరపత్రాలు అందించారు. ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, చేతివృత్తిదారులు, చిరువ్యాపారులు, చిరుఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని రాంబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్య.కా.స మండల కార్యదర్శి పూనెం అమ్ములు, కూలీలు పాల్గొన్నారు.