ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
కూలి పెంచాలి, భూమి పంచాలి నినాదంతో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల గీతాల సిడిని ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ వజ్రకిరణ్ శుక్రవారం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆవిష్కరించారు. కూలీల స్థితిగతులు తెలిపే ఐదు పాటలు కలిగిన ఈ సీడీలో ప్రముఖ ప్రజా కవులు దశరథ, కంకణాల ఆంజనేయులు, వేంపాటి బ్రహ్మయ్య, సాంబరాజు యాదగిరి, స్ఫూర్తి, శ్రీశ్రీలు రచించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర గాయకుల బృందం ఐవి అనిల్, పి.మంగరాజు, పెద్దిరాజు, జగన్ పద్మ, శాంతి, అనూష గీతాలను ఆలపించారు. ఈ సిడి ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ మహాసభల విజయవంతం కోరుతూ జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ ఏడో తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాగ్దేవి కారుడు తెలంగాణ ఎంఎల్‌సి ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండల రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, ప్రజాసంఘాల జిల్లా నాయకులు ఆర్.లింగరాజు, తెల్లం రామకృష్ణ, ఎం.నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు తామా ముత్యాలమ్మ, తుమ్మల సత్యనారాయణ, ఎ.రాణి, ఎ.ఫ్రాన్సిస్, పి.సూర్యారావు పాల్గొన్నారు.
డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సంఘ నాయకులు, కార్యకర్తల కార్యక్ర మం వేగవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ విరివిగా విరాళాల సేకరణ కార్యక్రమానికి వి.గోపి అధ్యక్షత వహించగా జి.సూర్యకిరణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కె.బుచ్చిరాజు, యు.చిన్నబాబు, ఎం.గంగరాజు, కె.మారయ్య పాల్గొన్నారు.










