ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని వి.టి.అగ్రహారం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను శనివారం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. వార్డు పర్యటనలో భాగంగా గతంలో విటి అగ్రహారంలో పర్యటించిన కోలగట్లకు స్థానిక యువకులు శిథిలావస్థలో ఉన్న వ్యాయామశాల గూర్చి వివరించారు. దీంతో సుమారు 23 లక్షల రూపాయలతో వ్యాయామశాల భవన నిర్మాణంతోపాటు వ్యాయామ సామగ్రిని కోలగట్ల సమకూర్చారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయా యాదవ్, వైసిపి జోనల్ ఇన్‌ఛార్జి బొద్దాన అప్పారావు, కార్పొరేటర్ చందక శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, మారం బాల బ్రహ్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ తాట్రాజు కృష్ణ, డివిజన్ అధ్యక్షులు అశోక్, నగరపాలక సంస్థ ఇఇ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ నగర్‌లో గడపగడపకు..
నగరంలోని 50వ డివిజన్ వైఎస్‌ఆర్‌నగర్‌లో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఎస్‌వివి రాజేష్ పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పట్టా ఆదిలక్ష్మి, వైసిపి నాయకులు తోనంగి జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










