Jan 22,2023 21:19

ప్రజాశక్తి - చింతలపూడి
           విజయవాడకు చెందిన విజిఆర్‌ డయాబెటిస్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో చింతలపూడి శ్రీచైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రధానోపాధ్యాయులు బి.సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ డయాబెటిస్‌ వ్యాధిపై అవగాహనుండాలని ఆ మహమ్మారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోనే కాకుండా వారి తల్లిదండ్రుల్లోనూ డయాబెటిస్‌పై అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల రీజనల్‌ ఇన్‌ఛార్జి పార్థసారధి , జోనల్‌ కో ఆర్డినేటర్‌ ఉదయభాస్కర్‌, డీన్‌ మధుబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.