Dec 23,2022 23:58

రత్నం ప్రతిభ

ప్రజాశక్తి-నక్కపల్లి:అనకాపల్లిలో కన్జ్యూమర్స్‌ ఎఫైర్స్‌ ఫుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లయర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో నక్కపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపీసీ విద్యార్థి టి.రత్నం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి మురళీధర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మూడు వేల రూపాయల నగదును రత్నంకు అందజేశారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్‌ కె.శైలజ, అధ్యాపకులు రత్నం కు అభినందనలు తెలిపారు.