ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్లలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన వ్యాపార సముదాయాన్ని ప్రారంభించారు. మంగళవారం జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ మహాలక్ష్మీ, వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలు శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రూ.11 లక్షలతో నిర్మించిన ఈ వ్యాపార సముదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దీని నుంచి వచ్చే ఆదాయంతో సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. అలాగే రూ.2 కోట్లతో ప్రారంభించిన సహకార సంఘం టర్నోవర్ నేడు రూ.12 కోట్లకు చేరుకోవడం గొప్ప విషయమన్నారు. రైతులు కూడా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించి సొసైటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సిఇఒ రామాంజనేయులు, డిసిఒ ఎన్.రామాంజనేయులు, ఐసిడిఎస్ సిఇఒ వెంకటకృష్ణ, ఆప్కాబ్ సిఇఒ విజరు కుమార్, కోడుమూరు మేనేజర్ వెంకటరమణ, సూపర్‌వైజర్ విష్ణువర్ధన్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ మన్సూర్, గోనెగండ్ల సింగిల్‌విండో ప్రెసిడెంట్ కాశీరెడ్డి, సిఇఒ చంద్రశేఖర్, సిబ్బంది మునిస్వామి, లక్ష్మన్న పాల్గొన్నారు.
షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న జగన్మోహన్‌రెడ్డి










