Apr 02,2023 22:27

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
            మండలంలోని గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్లి వస్తున్న వ్యాను ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురైంది. కామవరం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోపాలపురం మండలం ఖరగపురం గ్రామానికి చెందిన సుమారు 20 మంది ట్రాక్టర్‌లో గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్లారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఖమ్మానికి చెందిన 20 మంది మినీవ్యానులో ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం తిరిగుపయనమయ్యారు. కామవరం వద్దకు రాగానే ముందువెళ్తున్న వ్యానును ట్రాక్టర్‌ ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో వ్యాన్‌ను ఢకొీట్టడంతో రోడ్డు పక్కకు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంతర్వేదిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఖమ్మానికి చెందిన డి.నరసారావు(50), ఇ.మల్లేశ్వరి(40), డి.సాహితీ(11), జె.నరేంద్ర(40), వై.సైదమ్మ(60), పి.నాగశ్రీ(27), బి.ఉమ(37), జి.రమ(38), యు.భాస్కర్‌(37), వై.అలివేలు(38), ఇ.కృష్ణ(40) ఉన్నారు.