
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:ఫ్రై డే డ్రై డేను పురస్కరించుకొని మండలంలో సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామ సచివాలయాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లతో పాటు కీటక జనత వ్యాధులపై అవగాహన శిబిరాలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ ఎస్‌ఎస్‌వి శక్తి ప్రియ తెలిపారు. సైతార్ పేట గ్రామంలో ఆరోగ్య విస్తరణ అధికారి తంటపురెడ్డి నాగేశ్వరరావు, పిహెచ్‌ఎన్‌ఏం రత్నసఖి ఏడిస్ ఈజిప్ట్, ఎనాఫిలిక్స్, క్యూలెక్స్ జాతికి చెందిన దోమల కాటుతో ప్రబలే వ్యాధులు, నివారణపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో వారానికొక్కసారి ఖాళీ చేయాలని తెలిపారు. దోమల లార్వాలను మొదటి దశలోనే అంతం చేయడంతో వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని మలేరియా ఇన్చార్జ్ నోడల్ ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌లు కొండబాబు, అనుష, సచివాలయం హెల్త్ సెక్రటరీ లు పి.నూకరత్నం, పి శ్రీరాములు, వేణు పాల్గొన్నారు.