Jul 29,2022 23:55

ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్‌ గుండపు నాగేశ్వరరావు

ప్రజాశక్తి-ములగాడ : సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన కలిగి, వాటి నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని 40వ వార్డు కార్పొరేటర్‌ గుండపు నాగేశ్వరరావు అన్నారు. డ్రైడే ఫ్రైడే సందర్భంగా ఎకెసి కాలనీ సచివాలయం పరిధిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. దోమల విజృంభణ, పారిశుధ్యం క్షీణించడం వల్లే సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు దోమలు, లార్వాలకు ఆవాసమైన నీటి నిల్వ లేకుండా చూడాలని సూచించారు. వైద్యసిబ్బంది సూచనలు పాటించి, వ్యాధులు దరిచేరకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వార్డు శానిటరీ ఇనిస్పెక్టర్‌ శివప్రసాద్‌, మల్కాపురం ఏరియా మలేరియా ఇన్‌స్పెక్టర్‌ డి.రవికుమార్‌, సూపర్‌వైజర్‌ దుల్లా శ్రీనివాసరావు, సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీ సత్తిబాబు, మలేరియా సిబ్బంది డి లలితకుమారి, శ్రీదేవి, ఆశా కార్యకర్త నాగమణి పాల్గొన్నారు.