ప్రజాశక్తి - ఆదోని
వ్యాధులు లేని శరీరం, వణుకులేని శ్వాస వంటివి యోగా వల్ల కలిగే ప్రయాజనాలని ఆర్ట్స్ కళాశాల ఎన్‌సిసి అధికారులు అనిల్ కుమార్, పరిమళ తెలిపారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో యోగా చేస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మానవ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకొని ఆరోగ్యం, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవాలని తెలిపారు. యోగా వల్ల శరీరంలో ఒత్తిడి, హార్మోన్ కార్టిసాల్ స్థాయి తగ్గుతుందని చెప్పారు. యోగా మానసిక స్థితిని మెరుగుపరుస్తుందన్నారు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంచుతుందన్నారు. ఎన్‌సిసి అధికారులు లెఫ్ట్‌నెంట్ ఈరమ్మ, సుధాకర్ బాబు, నాగరత్న పాల్గొన్నారు. పట్టణంలోని భాష్యం ఆదోని-2 బ్రాంచిలో యోగా దితన్సోవం నిర్వహించారు. యోగా మాస్టర్ సురేష్ యోగా భంగిమలు ప్రదర్శించి ఆరోగ్యానికి మంచిదని వివరించారు. కేశవ మాస్టర్ కొన్ని యోగా టిప్స్ ఇచ్చారు. ఆదోని-2 బ్రాంచి ప్రిన్సిపల్ సదాశివ, వైస్ ప్రిన్సిపల్ అంజి, ప్రధానోపాధ్యాయులు వాణి పాల్గొన్నారు. ఆస్పరిలోని నారాయణ ప్రైమ్ స్కూల్‌లో యోగా దినోత్సవం నిర్వహించారు. నారాయణ ప్రైమ్ స్కూల్ కరస్పాండెంట్ నరేష్ ఆచారి, ఉపాధ్యాయలు సతీష్ కుమార్, జ్యోత్స్న, గాయత్రి, లూధియా, మణి, ఈశ్వర్, శ్రీదేవి, బాలు, గంగమ్మ, నారాయణ పాల్గొన్నారు. ఆదోని (రూరల్) పట్టణంలో సాయి కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ కరణం శివప్రసాద్ విద్యార్థులతో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. మండిగిరి పరిధిలో అమృత్ సరోవర్ మైదానంలో ఉపాధి హామీ చట్టం ద్వారా, పని ప్రదేశంలోనే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఏపీడీ లోకేశ్వర్ మాట్లాడుతూ... యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ఎఒ విజయ శేఖర్, ఇఒఆర్‌డి ఇన్‌ఛార్జీ కె.నాగరాజు, ఎపిఒ చంద్రశేఖర్, రజక సంఘం సెక్రటరీ ముక్కన్న పాల్గొన్నారు. చిప్పగిరి మండలంలోని కుందనగుర్తి గ్రామంలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలకు ఎపిఒ మాధవ శంకర్ యోగాపై అవగాహన కల్పించారు. యోగా చేయడం వల్ల మనిషి కండరాలన్నీ బాగా పని చేస్తాయని తెలిపారు. ఏపీడీ ఫక్కీరప్ప పాల్గొన్నారు. హోళగుంద సిద్ధార్థ పాఠశాలలో విద్యార్థులతో యోగా చేయించారు. సిద్ధార్థ పాఠశాల నిర్వాహకులు హెచ్.చిదానంద మాట్లాడుతూ... యోగా చేయడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు.
యోగా చేస్తున్న సిబ్బంది, విద్యార్థులు










