Mar 15,2023 16:32

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి



వస్తువులు కొనేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
ప్రజాశక్తి-డోన్

        ఏ షాపులో అయినా వస్తువులు కొనేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మ,సీనియర్ ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి లు పేర్కొన్నారు.బుధవారం అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పాఠశాల ఆవరణంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులందరూ దుకాణం నందు వస్తువును కొనుగోలు చేసినప్పుడు,ఆ వస్తువు తయారుచేసిన తేదీ మరియు ఎక్స్పైర్ తేదీని గమనించి కొనాలని,కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలన్నారు.ముఖ్యంగా మెడిసిన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. మినరల్ వాటర్ కొనేటప్పుడు ఐఎస్ఐ మార్కు ఉన్న వాటర్ బాటిల్ తీసుకోవాలన్నారు.బంగారు మరియు వెండి వస్తువులు కొనేటప్పుడు హాల్ మార్క్ గమనించాలన్నారు.అలాగే విత్తనాలు, ఎరువులు,మందులు కొన్నప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలని సూచించారు.ఏ వస్తువును కొనుగోలు చేసిన ఖచ్చితంగా బిల్లు తీసుకుని, ఏదైనా సమస్య వస్తే వినియోగదారుల ఫోరం కు కంప్లైంట్ ఇస్తే,వారు ఎంక్వయిరీ చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్,వెంకటేశ్వర్ గౌడ్, రవిశేఖర్,వెంకట లక్ష్మీ,వెంకట రమణ,లక్ష్మయ్య, చంద్రశేఖర్ గౌడ్,సుబ్బారెడ్డి,రాధ,అనంత శ్రీనివాసులు,అల్లిపీరా,లక్ష్మి కాంతరెడ్డి,సుభాన్, మధుసూదన్ రెడ్డి,మద్దిలేటి,భూకాంతరెడ్డి, జయసుబ్బారాయుడు,శివన్న,ఆదినారాయణ, సురేష్,లీలావతమ్మ,శ్రీకళ,భారతి,రమేష్, సంజీవరెడ్డి, దేవేంద్రప్ప, రాఘవేంద్ర, రామ్మూర్తి, సుబ్బరాయుడు,శ్రీనివాసులు,భాను ప్రకాష్ రెడ్డి, లక్ష్మి ప్రభావతి,మునిరాజు,ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.