Dec 05,2022 23:26

ప్రజాశక్తి-తిరువూరు: పెండింగ్‌లో ఉన్న విద్య దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెం.77ను రద్దుచేసి పీజీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ ఫీజు రీయింబర్స్మెంట్‌ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం తిరువూరు ఆర్డీవో కార్యా లయం ముందు ధర్నా చేశారు. ఈసం దర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్యం అధికారంలోకి వచ్చి నప్పటినుంచి డిగ్రీ, ఇంజినీరింగ్‌ ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇవాల్సిన స్కాలర్‌ షిప్‌ బకాయిలు నేటికీ విడుదల చేయకపోవడం బాధా కరమన్నారు. దీనితో విద్యార్థులు అనే క ఇబ్బందులు పడుతున్నారని, అప్పు చేసి కాలేజికి ఫీజు కట్టవలసి వస్తుంద ని, ఫీజులు కట్టలేని విద్యార్థులు చదు వుకు దూరమవుతున్నారని ఆయన అవేదేన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభు త్వం గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌ లో ఉన్న వసతి, విద్య దీవెన్ల, స్కాలర్‌ షిప్స్‌ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జీవో నెం.77 ప్రభుత్వం తీసుకువచ్చి ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్‌, ఫీజు రీ యింబర్స్మెంట్‌ నిలుపుదల చేయటం వలన రాష్ట్రంలో పీజీ అడ్మిషన్‌ సగా నికి పైగా పడిపోయాయని, పై చదువు లు చదవాలనుకునే పేద విద్యార్థుల కలను ఈప్రభుత్వం పాతర వేసింద న్నారు. దీనివలన భవిష్యత్తులో టీచర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందో ళన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి జీఓ నెం 77 రద్దు చేసి పేద విద్యార్థులు పీజీ చదవటానికి స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్స్‌ ఇవ్వా లని ప్రభుత్వాన్ని వెంకటే శ్వరరావు డిమాండ్‌ చేశారు. అనంత రం ఆర్డీవో ప్రసన్నలక్ష్మికి వినతిపత్రం అందజేశా రు. ఈకార్యక్రమంలో సిఐటియు మం డల కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ తిరువూరు మండలం కార్య దర్శి నాగేంద్ర, బాబు, గర్ల్స్‌ కన్వీనర్‌ వెంకటలక్ష్మి, తతితరులు పాల్గొన్నారు.