Sep 30,2023 20:04

పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి

పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి
వసతి గృహంలో పరిశీలన
ప్రజాశక్తి-అనంతసాగరం:మండలంలోని రేవూరలో బీసీ బాలికల వసతిగహాన్ని శనివారం శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి పరిశీలించారు.వార్డెన్‌ మల్లీశ్వరి, విద్యార్థులను వసతిగహ పరిస్థితులు, విద్యార్థులను ఎలా చదువుతున్నారంటూ అడిగి తెలుసుకుని బాగా చదువుకోవాలని సూచించారు. వసతిగహం నిర్మాణం జరిగి అనేక సంవత్సరాలు కావడంతో ప్రస్తుతం దెబ్బతిని ఉందని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని వారు కోరడంతో వెంటనే వసతిగహానికి అవసరమైన సదుపాయాలు గురించి నివేదిక అందచేయాలన్నారు. 3న కలెక్టర్‌ తో సమీక్షలో ఈ విషయమై చర్చించి భవన మరమ్మతులకు నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట నాయకులు కార్యకర్తలు ఉన్నారు.