చెరుకూరు వసతి గృహాన్ని పరిశీలిస్తున్న జడ్జి కుముదిని
ప్రజాశక్తి-పర్చూరు: వసతి గృహాల్లో మెను తప్పనిసరిగా పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం కుముదిని ఆదేశించారు. పర్చూరు మండలం చెరుకూరులోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని శనివారం ఆమె సందర్శించారు. బాలురు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. వసతి గృహంలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఆహార పదార్థాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి విద్యార్థిని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జడ్జి వెంట కోర్టు సిబ్బంది, సంక్షేమ అధికారి ఉన్నారు.










