Feb 13,2023 23:55

విద్యార్థులతో భోజనం చేస్తున్న అధికారులు


ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలో ఎస్‌సి, బీసీ బాలుర వసతి గృహాలను సోమవారం ఎంపీడీవో సీతారామరాజు, ఎంఈఓ డివిడి ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీసీ వసతి గృహంలో పది మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా ఉండటాన్ని గమనించి హాస్టల్‌ వార్డెన్‌ను ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించారు. హాస్టల్‌ గదులు, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, ఆహారం రుచికరంగా ఉండలేదని, మంచినీటి సదుపాయం లేదని వంటి సమస్యలను విద్యార్థులు ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లారు. వార్డెన్‌పై ఎంపీడీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందజేయాలన్నారు. అనంతరం ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థినిలతో కలిసి భోజనం చేసారు. స్థానిక ఎంపీపీ స్కూల్‌ ను తనిఖీ చేసారు.