Apr 27,2023 01:45
వసతి దీవెనను చెక్కు రూపంలో అందజేస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జగనన్న వసతి దీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్‌లో జగనన్న వసతి దీవెన నిధుల విడుదలపై ముఖ్యమంత్రి వర్చువల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన పేద విద్యార్థులకు మంచి అవకాశమన్నారు. పేద విద్యార్థుల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బాపట్ల జిల్లాలో 30, 611 మంది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు సంబంధించి 27,439 మంది తల్లుల ఖాతాలకు రూ.29.16 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రూ.29.16 కోట్ల మెగా చెక్‌ను విద్యార్థుల తల్లులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్‌ దెబోరా, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కల్పన, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.