వృత్తిపర సవాళ్లు పరిష్కారంపై అవగాహన
ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె రాణి 'వ్యక్తిత్వ వికాసం వృత్తిపరమైన సవాళ్లు పరిష్కారం' అంశం పై మహిళా వర్సిటీ లా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సైకాలజిస్ట్ బి. రుక్మిణి మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో దశల మార్పు వస్తుందని, అదే క్రమం లో ఎన్నో ఆరోగ్య ,ఆర్థిక ,సామాజిక ,మానసిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని వీటిని అధిగమించడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు మంచి వ్యక్తిత్వం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు మోటివేషన్ స్టోరీస్, వీడియోస్ చూపించారు. అంతేకాకుండా ప్రశ్నలకు సమాధానాలు రాయించి కొన్ని ఎక్సర్సైజెస్ చేయించారు. గ్రూప్ డిస్కషన్, వత్తిపర సవాళ్లు, వాటి పరిష్కారాలను చర్చించి వివరించారు. చివరిగా పరిస్థితులను, సవాళ్లను చూసి ఆగిపోకుండా ముందుకు పోవాలని పట్టుదల, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలన్నారు. వృత్తిపర నైపుణ్యాలను, మెలుకువలను కష్టపడే తత్వం, సానుకూల దక్పథం, సమయపాలన అలవరుచుకోవాలని విద్యార్థినులకు సూచిం చారు. ఈ విధంగా వ్యక్తిత్వ వికాసం గురించి వివరిస్తూ విద్యార్థులు అందరూ వ్యక్తిగత, వత్తి జీవితం విజయవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లా డిపార్ట్మెంట్ హెడ్ మాధురి పరదే, ఉమెన్స్ స్టడీ సెంటర్ రీసెర్చ్ అసిస్టెంట్ ప్రీతి సహాయ సహకారాలు అందించారు.










