పెదకూరపాడు: వృత్తి విద్యా కోర్సులు చేస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని శాసన సభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. నూతనంగా ప్రభుత్వ గుర్తింపు పొందినస్థానిక అమరావతి రోడ్ లోని వేద పారా మెడికల్ కాలేజీనీ ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు కళాశాల డైరెక్టర్ సిహెచ్ రమేష్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సింగ్ పారా మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు తల్లితండ్రులకు ఆయా కోర్సుల గురించి అవగాహన కల్పించాలన్నారు.హై కోర్టు న్యాయవాది ఉల్లం శేషగిరిరావు మాట్లాడుతూ అతితక్కువ సమయంలో జీవితంలో స్థిరపడే కోర్సులను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేస్తున్న వేద విద్యా సంస్థలను ఆయన అభినందించారు. తరగతి గదులను డాక్టర్ గజ్జెల నాగభూషణ రెడ్డి, ప్రయోగశాలలను పెదకూరపాడు సర్పంచ్ గుడిపూడి రాజు ప్రారంభించారు. అనంతరం జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపిపి వీరయ్య, క్రోసూరు యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి ప్రారంభించారు. వైద్యశిబరంలో డాక్టర్ దాసరి రజనీ కాంత్. డాక్టర్ శారదా రెడ్డి, డాక్టర్ జి.రవిశంకర్ రెడ్డి రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందించారు.










