
ప్రజాశక్తి - కర్లపాలెం
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఓ పేద వృద్ధురాలి నివాసం కూలిపోయింది. ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు కత్తి మర్తమ్మ కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసినట్లు ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రెడ్డి గోపి తెలిపారు. మండలం బిడారు దిబ్బ గ్రామంలో కూలిపోయిన నివాసాన్ని సోమవారం పరిశీలించారు. బాధితురాలికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామంలో 1978లో ఓ సంస్థ నిర్వాహకులు పేదవారిని గుర్తించి గృహాలు కట్టించారని, ప్రస్తుతం ఆ గృహాలు వర్షాలకు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, ప్రజలపై పడుతూ గాయాలు పాలవుతున్నారని పేర్కొన్నారు. శిథిలా వ్యవస్థకు చేరిన ఇళ్లను పరిశీలించి పేదవారికి పక్కా గృహాలు నిర్మించాలని ఆయన కోరారు. అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో ప్రమాదాలు జరుగుతాయని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మద్దిబోయిన గోపి, మహబూబ్ సుభాని, నందిపాటి సునీల్ శ్రీరామ్, కార్యదర్శి బత్తులు సురేష్, ట్రెజరర్ జోగి సువర్ణ రాజు, సభ్యులు చామర్తి సుబ్బారావు, నరాలశెట్టి సుబ్బారావు, షేక్ నైముళ్ళ, రాజా రమేష్ పాల్గొన్నారు.