Jul 11,2023 00:18

వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్‌పి ఆరీఫ్‌హఫీజ్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : స్థానిక గుంటూరువారితోటలో ఈనెల 2వ తేదీన దొంగతనం కోసం వెళ్లి వృద్దురాలిని హత్య చేసిన ఘటనలో నిందితుడు రావిపాటి జగదీష్‌ను అరెస్టు చేసి రూ.88 వేలు నగదుస్వాధీనం చేసుకున్నట్టు అర్బన్‌ ఎస్‌పి ఆరీఫ్‌ హఫీజ్‌ సోమవారం తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలాఉన్నాయి. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన జగదీష్‌ గత కొంత కాలంగా గుంటూరులో సంచరిస్తూ దొంగతనాలకుపాల్పడుతున్నారు. జులాయిగా తిరుగుతూ కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను ఒక వృత్తిగా ఎంచుకున్నాడు. ఈనెల 2వ తేదీన ఉదయము 11.00 గంటల సమయములో గుంటూరు వారితోట ఆదిత్య హాస్పటల్‌ వద్దకు వెళ్తూ ఉండగా ఒక వద్ధురాలు తన ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించి ఆమె వద్ద ఉన్న ఆభరణాలను దొంగిలించాలని రెక్కి నిర్వహించాడు. ఆమె ఇంటిలోనికి వెళ్లి ఆమెను తన వెంట తెచుకున్న సుత్తి తో తల పైన కొట్టి ఆమెను చంపి ఆమె వద్ద ఉన్న మెడలో ఉన్న బంగారపు గొలుసును దొంగలించి, ఇంటిలో మచం మిద ఉన్న మతురాలు పర్సు లో ఉన్న బంగారపు చెవి మాటిలు నగదు రూ.1200 దొంగిలించాడు. అనంతరం పరారయ్యాడు. మూడో తేదీన ఒంగోలులోని ఆటిక గోల్డ్‌లో తాకట్టు పెట్టి రూ.లక్షా 43వేలు తీసుకున్నాడు. గతంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక నేరాలకు పాల్పడ్డాడు. వ్యసనాలకు అలవాటు పడి ఒంటరిగా ఉండే మహిళలు ఉండే ఇల్లు వెతికి వారిని చంపి వారి వద్ద ఉన్న బంగారూ నగలు దొంగలించి వాటిని బయట అమ్ముకొని ఎక్కువ డబ్బులు సులభంగా సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటాడు. పద్మ సప్లయర్‌ అను సున్నపు పని సామానులు అద్దెకు ఇచ్చే షాప్‌ లో ఒక సుత్తి అద్దెకు తీసుకుని పనికి వెళ్తున్న వాడిగా నటించి ఈనెల 2న ఒంగోలు నుంచి గుంటూరు వచ్చాడు. గుంటూరు కు రైలు లో వచ్చి గుంటూరులో రైల్వే స్టేషన్‌ నుండి ఆర్టీసీ బస్టాండుకు నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక డాబా మీద సుమారు 60 సంవత్సరాలు వయసు కలిగిన అడమనిషి ఒంటరిగా కన్పించడంతో ఈ నేరానికి పాల్పడ్డాడు. అదనపు ఎస్‌పి శ్రీనివాసరావు, ఎఎస్‌పి నచికేట్‌ షిల్కే ఆధ్వర్యంలో కొత్తపేట సిఐ అన్వర్‌ భాషా ,ఎస్‌ఐ ఎస్‌.కె.ఎం.డి.మేరాజ్‌ కేసుదర్యాప్తు చేస్తున్నారు.