Aug 16,2022 00:15

వృద్ధులకు దుస్తులు పంపిణీచేస్తున్న విశ్రాంత ఉద్యోగులు

ప్రజాశక్తి-పెందుర్తి : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ విశ్రాంత ఉద్యోగులు ఆధ్వర్యాన లయోలా ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో వృద్ధులకు దుస్తులను పంపిణీచేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రెసిడెంట్‌ దామోదర మాట్లాడుతూ, అభాగ్యులకు అండగా ఉండేందుకు అసోసియేషన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏటా ఆగస్టు 15వ తేదీన ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సేవా గుణం కలిగిఉండాలన్నారు. జనరల్‌ సెక్రెటరీ సూర్యనారాయణ మాట్లాడుతూ, వృద్ధులను ఆదుకునేందుకు ఆర్థికసహాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రమేష్‌కుమార్‌, శివరావు, పోతురాజు, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.