Jan 01,2023 00:24

వృద్ధులకు చీరలు అందజేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి

ప్రజాశక్తి - ఆరిలోవ : హాజీ అబ్బాస్‌ హుస్సేన్‌ ఆర్థిక సాయంతో ముస్తాఫా ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన, 11వ వార్డు పరిధి కనకదుర్గానగర్‌ విశాఖ ముస్లిం మదర్శలో శనివారం పేద వృద్ధులకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక సందర్భాలలో కుల, మత బేధం లేకుండా అందరికి సహాయ సహకారాలు అందిస్తున్న అబ్బాస్‌ హుస్సేన్‌ను అభినందించారు. ముస్లిములకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు కాలేషా, కార్యదర్శి అక్బర్‌ ఆలీ, కోశాధికారి జానీ, టిడిపి నాయకులు ఒమ్మి అప్పలరాజు, గాడి సత్యం, మూది అప్పారావు, ముగడ రాజారావు పాల్గొన్నారు.